ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏకీకృత ఫీజు అమలు విధానం మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కన్వీనర్ కోటా, యాజమాన్యం కోటా సీట్లకు ఫీజులో తేడాను పాటిస్తూ ఫీజుల విధానానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విద్యాసంవత్సరం 2012 - 2013 నుంచే ఏకీకృత ఫీజు విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మెరిట్ ప్రాతిపదికన కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే ఎ కెటగీరీ సీట్లకు, యాజమాన్య కోటా కింద భర్తీ చేసే బి కెటగిరీ సీట్లకు ఒకే రకమైన ఫీజులు ఇక నుంచి అమలు కానుంది.కన్వీనర్ కోటా కింద ఇప్పటి వరకు 35 వేల రూపాయల ఫీజు ఉంది. ఇప్పుడు ఆ ఫీజు 50200 కు పెరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజీల్లోని 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతా 30 శాతం సీట్లను యాజమాన్యం కోటా కింద భర్తీ చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా కింద ఫీజు 95 వేల రూపాయలు ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment